Sunday, May 4, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికా సీఐఏలో భారీగా ఉద్యోగాల కోత

అమెరికా సీఐఏలో భారీగా ఉద్యోగాల కోత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్‌ యంత్రాంగం భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇందులోభాగంగా యూఎస్‌ ప్రభుత్వం తాజాగా సెంట్రల్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలో సంస్కరణలకు సిద్ధమైంది. ఏజెన్సీలోని 1200 మంది ఉద్యోగులను తొలగించడానికి కసరత్తు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదే పంథాలో మరికొన్ని ఏజెన్సీలలోనూ వేలాది ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని వెల్లడించాయి. అయితే ఈ నివేదికలపై సీఐఏ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో స్పందించాల్సి ఉంది.
సీఐఏలోని ప్రణాళికాబద్ధమైన కోతల గురించి అమెరికా ప్రభుత్వం చట్టసభ సభ్యులకు తెలియజేసినట్లు సమాచారం. ఏజెన్సీలో ఇకపై నియామకాల తగ్గింపునకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి.. మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన సమగ్ర వ్యూహంలో భాగంగా కొన్ని మార్పులు చేస్తున్నట్లు సీఐఏ ప్రతినిధి రాట్‌క్లిప్‌ తెలిపారు. తన నేతృత్వంలో సీఐఏ వ్యక్తిగత పక్షపాతాలు లేకుండా.. నిష్పాక్షికంగా పని చేస్తోందన్నారు. ఎంత కష్టమైనప్పటికీ తాము ప్రపంచంలో ఎవరూ వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లి.. ప్రతి మూలలోని నిఘా సమాచారాన్ని సేకరిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -