Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంమాటమార్చిన ట్రంప్‌

మాటమార్చిన ట్రంప్‌

- Advertisement -

భారత్‌తో సంబంధం ప్రత్యేకమైనదని వ్యాఖ్య
వాషింగ్టన్‌
: రష్యా నుంచి చమురు కొనుగోలు, అమెరికా వస్తువులను తన మార్కెట్‌లోకి అనుమతించేందుకు నిరాకరించడం, చైనాతో స్నేహ సంబంధాలను కొనసాగించడం వంటి భారత్‌ చర్యలు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ను ఆగ్రహానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. భారత్‌ను చైనాకు కోల్పోయామంటూ ఆయన తాజాగా తన ట్రూత్‌ సోషల్‌ వేదికలో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ట్రంప్‌ తన ఓవల్‌ కార్యాలయంలో పాత్రికేయులతో ముచ్చటిస్తూ భారత్‌, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉన్నదని చెప్పారు. ఈ సంబంధాలకు విఘాతం కలుగుతుందంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘విచారించాల్సిన అవసరమే లేదు. కొన్ని సందర్భానుసారంగా అలా జరిగిపోతూ ఉంటాయి’ అని ట్రంప్‌ తెలిపారు. ప్రధానితో తన వ్యక్తిగత బంధం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోతుందని చిరునవ్వుతో అన్నారు. ‘మోడీతో నా స్నేహం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఆయన చాలా గొప్ప ప్రధాని. గొప్ప వ్యక్తి. మేము ఎప్పుడూ స్నేహితులమే. అయితే ఆయన ప్రస్తుతం చేస్తున్న పని నాకు నచ్చడం లేదు’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్‌ వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ వెలుగు చూడగానే మోడీ వెంటనే దానిని తన ఎక్స్‌ ఖాతాలో కోట్‌ చేశారు.

మాస్కో నుంచి భారత్‌ నిరంతరం చమురును కొనుగోలు చేస్తుండడంపై ట్రంప్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రష్యా నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేయడం నన్ను ఎంతగానో అసంతృప్తికి గురిచేసింది. ఆ విషయాన్ని వారికి తెలియజేశాను. మేము భారత్‌పై భారీ సుంకాన్ని విధించాం. యాభై శాతం టారిఫ్‌…చాలా ఎక్కువ సుంకం. మోడీతో నేను బాగానే ఉంటున్నాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి. కొన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చారు’ అని అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై మోడీ స్పందిస్తూ ఆయన అభిప్రాయాలను, తమ సంబంధాలపై ఆయన సానుకూల అంచనాను గౌరవిస్తానని తెలిపారు. భారత్‌, అమెరికా దేశాలు సానుకూలమైన, ముందుచూపుతో కూడిన సమగ్ర, అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని మోడీ చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad