Tuesday, September 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ మ‌రో టారిఫ్ బాంబు..ఈసారి దేనిమీదంటే..?

ట్రంప్ మ‌రో టారిఫ్ బాంబు..ఈసారి దేనిమీదంటే..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టారిఫ్‌ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో బాంబు పేల్చారు. ఫర్నిచర్‌, కలపపై సుంకాల మోత మోగించారు. కలప పై 10 శాతం, కిచెన్ క్యాబినెట్‌లు (), అప్‌హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌ పై 25 శాతం సుంకాలను ప్రకటించారు. ఈ టారిఫ్‌లు అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

మరోవైపు అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌ ద్వారా సోమవారం ప్రకటించారు. విదేశాలలోని పోటీదారులు అమెరికన్‌ సినీ వ్యాపారాన్ని కొల్లగొడుతున్నారని ట్రంప్‌ తెలిపారు. పసిబిడ్డ నుంచి చాక్లెట్‌ చోరీ చేసిన విధంగానే ఇతర దేశాలు అమెరికా సినీ నిర్మాణ వ్యాపారాన్ని చోరీ చేస్తున్నాయి అని ట్రంప్‌ ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -