నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలతో కలిపి 50 శాతం పన్నులను విధించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని తాజాగా ఆ దేశ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు అనంతరం ఆ దేశ ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ పార్టీ ట్రంప్‌పై తీవ్రంగా విరుచుకుపడుతోంది. తాజాగా ట్రంప్ విధించే సుంకాలకు ముగింపు కాలని ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని స్పీకర్ మైక్ జాన్సన్‌ను డెమోక్రాట్ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్ కోరారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఇఇపిఎ) ట్రంప్ సుంకాలు విధించడానికి అనుమతించదని ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ట్రంప్ అక్రమంగా.. అన్యాయంగా.. చట్టవిరుద్దంగా సుంకాలను విధించారు. ఈ చట్టవిరుద్ధమైన పనిని ట్రంప్ కప్పిపుచ్చుకోవడాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ జాన్సన్ ఆపాలని డెమోక్రటిక్ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్ కోరారు. ట్రయల్, అప్పీలేట్ కోర్టులు రెండూ ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని చెప్పాయని మీక్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఇఇపిఎ అనేది టారిఫ్ చట్టం కాదు. ట్రంప్ తనకిష్టమొచ్చినట్టుగా సుంకాలను పెంచడం.. ఆ అక్రమాలను ఆయన కప్పిపుచ్చడం మానుకోవాలని, సుంకాలను విధించడానికి ముగింపు పలకడానికి తన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని గ్రొగెరీ మీక్స్ కోరారు.
ఫెడరల్ కోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES