నవతెలంగాణ-హైదరాబాద్: హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజులను లక్షడాలర్లపైనే పెంచితూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. హెచ్ వన్ బీ వీసాల అప్లికేషన్ ఫీజులు పెంచి..ప్రధాని మోడీకి బర్త్ డే గ్రిప్ట్‌గా ఇచ్చారని ఎద్దేవా చేశారు. బర్త్ డే రిటర్న్ గిప్ట్‌లో భాగంగా.. లక్షడాలర్లు పెనాల్టీ భారతీయులపై మోపారని, దీంతో విదేశాంగ విధానంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మరోసారి రుజువు అయిందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. H-1B వీసా లబ్దిదారుల్లో 70శాతం భారతీయులే ఉంటారని, ట్రంప్ నిర్ణయంతో ఇండియన్ టెక్ ఉద్యోగులపై పెను ప్రభావం చూపనుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశాంగ విధానం అంటే మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం, భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచడమని సూచించారు. సమతుల్యతతో స్నేహాలను నడిపించుకోవాలన్నారు, కానీ బీజేపీ ముందుచూపుతో వ్యవహరించడంలేదని విమర్శించారు. ఇప్పటికే 50శాతం అదనపు సుంకాలతో భారత్‌ను ట్రంప్ దెబ్బతీశారని గుర్తు చేశారు. దీంతో ఎగుమతులపరంగా కనీసం రూ. 2.17 లక్షల కోట్ల మేర నష్టం వచ్చిందన్నారు. అంతేకాకుండా చాబహరన్ పోర్టుపై కూడా ఆంక్షలు విధించడానికి యూఎస్ సిద్దమైందని, దీంతో భారత్ పెట్టుబడులపై ప్రభావం పడనుందని తెలిపారు. ట్రంప్- మోడీ స్నేహం విదేశాంగ విధానంలో ఏ మేరకు ఉపయోగపడిందని ప్రశ్నించారు.