నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధానికి ముగింపు పలికించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నారు. ఇజ్రాయిల్- అమెరికా చేస్తున్న దాడులకు ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు పాల్పడింది. ఖతార్, యుఎఇ, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో అమెరికా సైనిక, ఇంధన స్థావరాలపై దాడుల చేయవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ట్రంప్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
కాగా, అమెరికా ఐదు లక్ష్యాలతో ఇరాన్‌పై దాడికా పాల్పడింది. 1. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, ప్రయోగ వాహనాలు, వాటికి సంబంధించిన ప్రతిదాన్నీ పూర్తిగా నిర్వీర్యం చేయడం. 2. ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని నాశనం చేయడం. 3. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళాన్ని, విమాన నిరోధక ఆయుధాలతో సహా నిర్మూలించడం. 4. అమెరికా అణ్వాయుధాలకు సమానంగా ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం కనీసం దగ్గరగా కూడా రానివ్వకపోవడం, ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తితే దానికి అమెరికా త్వరితగతిన శక్తివంతంగా ప్రతిస్పందించే స్థితిలో ఉండాలి. 5. ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్‌తో సహా మధ్యప్రాచ్య మిత్రదేశాలను అత్యున్నత స్థాయిలో రక్షించాలి. ఈ ఐదు లక్ష్యాలతో అమెరికా ఇరాన్‌పై దాడికి పాల్పడింది.
హార్మూజ్ జలసంధిని ఉపయోగించే ఇతర దేశాలు అవసరమైనప్పుడు దానికి కాపలా కాయాలి. దానిని పర్యవేక్షించాలి. అమెరికా మాత్రం దానిని ఉపయోగించదు అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. అలాగే ఈ యుద్ధ సమయంలో హోర్మూజ్ ద్వారా వెళ్లే నౌకలకు సంబంధించి ఆయా దేశాలు అడిగితే మేము సహాయం చేస్తాము. కానీ ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత దాని అవసరం ఉండకూడదు. ఎందుకంటే ఇది వారికి సులభమైన సైనిక చర్య అవుతుంది అని తాజాగా ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు.



