Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికే!

ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికే!

- Advertisement -

– పాక్‌ ఆర్మీ చీఫ్‌తో విందు సమావేశంపై ట్రంప్‌
– మండిపడ్డ కాంగ్రెస్‌
న్యూఢిల్లీ:
పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో మునీర్‌ పాత్రను ట్రంప్‌ ప్రశంసించారు. ”ఆయనను ఇక్కడకు విందుకు ఆహ్వానించడానికి కారణం, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికే. భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం జరగకుండా నివారించడానికి ఆయన కృషి చేశారు.” అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ తీరు భారత దౌత్యానికి ఎదురుదెబ్బ అని ఆయన విమర్శించారు. ‘పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ ఏ దేశాధినేత కాదు.. లేదా ఏ ప్రభుత్వాధినేత కాదు. ఆయన పాకిస్తాన్‌ సైన్యాధిపతి మాత్రమే, అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆయనను వైట్‌హౌస్‌లో భోజనానికి ఆహ్వానించి, అమితంగా ప్రశంసించారు. పెహల్గామ్‌ దాడి తర్వాత రెచ్చగొట్టే, అభ్యంతరకరమైన ప్రకటనలు చేసిన వ్యక్తి మునీర్‌, ఆయన నాయకత్వంలో పాక్‌ సైనిక యంత్రాంగమే భారత్‌పై దాడి చేసింది. ఇది భారత దౌత్యానికి పెద్ద ఎదురుదెబ్బ అని ఆయన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -