Thursday, May 15, 2025
Homeజాతీయంమోడీకి ట్రంప్‌ షాక్‌

మోడీకి ట్రంప్‌ షాక్‌

- Advertisement -

– మిత్రుడి నుంచి ఊహించని ప్రకటనలు
– జోక్యం చేసుకోబోమంటూనే..కాల్పుల విరమణ ప్రకటన
– కాశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికీ ప్రతిపాదనలు
– భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల విషయంలో అమెరికా అధ్యక్షుడి తీరు
– ట్రంప్‌ ప్రకటనలపై స్పందించని భారత ప్రధాని
న్యూఢిలీ:
భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ కాల్పుల విరమణను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీరు తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఈ విషయంపై భారత్‌లోని ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనను వ్యక్తపరుస్తున్నాయి. ట్రంప్‌ తీరు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నదని ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో డోనాల్డ్‌ ట్రంప్‌నకు మోడీ తలొగ్గారంటూ వాదిస్తున్నాయి. వాస్తవానికి, డోనాల్డ్‌ ట్రంప్‌తో మోడీకి మంచి సంబంధాలున్నాయంటూ బీజేపీ నాయకులు తరచూ చెప్తుంటారు. ట్రంప్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా భారత్‌లో పర్యటించిన సందర్భంగా ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని మోడీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రంప్‌ను తన మిత్రుడిగా మోడీ అభివర్ణించాడు. ఆ తర్వాత, మోడీ కూడా అమెరికా పర్యటనకు వెళ్లాడు. తదుపరి ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌కు భారత సంతతి ఓట్లు దక్కేలా చేయటంలో భాగంగా ‘హౌడీ మోడీ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. మోడీ అందులో పాల్గొన్నాడు. ట్రంప్‌ చేతిలో చేయి వేస్తూ సభా ప్రాంగణంలో కలియ తిరిగారు. ఇది మోడీ-ట్రంప్‌ల మధ్య ఉన్న దృఢమైన బంధాన్ని తెలియజేస్తున్నదని బీజేపీ, దాని అనుకూల మీడియా తీవ్ర ప్రచారాన్ని కల్పించింది. ఇటీవల భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సందర్భంగా ఆ విషయంలో జోక్యం చేసుకోబోమన్న ట్రంప్‌.. ఉన్నట్టుండి కాల్పుల విరమణ ప్రకటన చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా దీనిని ప్రకటించారు. అప్పటి వరకు పాక్‌కు వ్యతిరేకంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో తీవ్రమైన హైప్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సృష్టించింది. అయితే, ట్రంప్‌ ప్రకటన మోడీ, బీజేపీ మద్దతుదారులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. కాశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్‌ చెప్పటం పట్ల కూడా వారు విస్మ యానికి గురయ్యారు. ఇలా ట్రంప్‌ నుంచి వచ్చిన పలు ఊహించని ప్రక టనలు బీజేపీ పరివారాన్ని షాక్‌కు గురి చేశాయి అని విశ్లేషకులు చెప్తు న్నారు. ఇక కాశ్మీర్‌ విషయంలో మోడీ స్నేహితుడైన ట్రంప్‌నకు ఉన్న అవ గాహన ఎలాంటిదో ఆయన ప్రకటనలోనే అర్థమవుతుందని అంటు న్నారు. తన మధ్యవర్తిత్వం వల్లే భారత్‌, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్‌ తెలిపారు. దీంతో అప్పటివరకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో తీవ్ర హైప్‌ క్రియేట్‌ చేసిన మోడీకి ట్రంప్‌ ప్రకటనతో ఎదురు దెబ్బ తాకినట్టయ్యింది. ఇక ఉద్రిక్తతలను తగ్గించకపోతే రెండు దేశాలతో వాణి జ్యాన్ని చేయబోనని తాను చెప్పటంతో భారత్‌-పాక్‌లు కాల్పుల విరమ ణకు వచ్చాయని ట్రంప్‌ చెప్పారు. ఈనెల 12న జాతినుద్దేశిస్తూ మోడీ చేసే ప్రసంగానికి కొన్ని నిమిషాల ముందే అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేయటం గమనార్హం. ఇలాంటి తరుణంలో ట్రంప్‌ ప్రకటనల విషయంలో మోడీ దీటుగా స్పందిస్తారని అంతా భావించారు. కానీ, భారత ప్రధాని ఏ ఒక్కసారి కూడా ఆయన పేరును ప్రస్తావించక పోగా ఆయన చేసిన ప్రకటనలపైనా స్పందించ లేదు. అయితే మోడీ మౌనంపై అందరిలోనూ అనుమానాలున్నాయి. విశ్వగురువు అని చెప్పుకునే మోడీ.. అమెరికా అధ్యక్షుడిని సర్వశక్తి వంతమైన నాయకుడిగా సమ్మతించారా? లేక ట్రంప్‌ చెప్పినవి నిజాలు కాబట్టే మోడీ స్పందించలేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాకిస్తాన్‌తో ఉగ్రవాదం, పాక్‌ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌ (పీఓజేకే) మీదనే చర్చలు ఉంటాయని నొక్కి చెప్పిన ప్రధాని మోడీ.. కాశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ట్రంప్‌ ప్రకటనపై ‘నేరుగా’ ఎందుకు స్పందించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -