Tuesday, May 20, 2025
Homeఅంతర్జాతీయంపుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్..ఏమ‌న్న‌రంటే..

పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్..ఏమ‌న్న‌రంటే..

- Advertisement -

పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్..ఏమ‌న్న‌రంటే..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి మంగళవారం అమెరికా ప్రెసిడెంట్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెండు దేశాల మ‌ధ్య వార్ ముగుస్తుంద‌ని, అందుకు ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ తో రెండు గంట‌ల‌పాటు ఫోన్ మాట్లాడిన‌ట్టు ట్రంప్ త‌న ట్రూత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లడించారు. దీంతో మ‌రోమారు ఇరుదేశాల యుద్ధ విర‌మ‌ణ‌పై చ‌ర్చ‌లు త్వ‌రలోనే ప్రారంభ‌మవుతాయ‌ని ట్రంప్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. అర‌బ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు పుతిన్ ఫోన్ లో మాట్లాడుతాన‌ని ఆయ‌న దోహా ఎయిర్ పోర్టులో మీడియా స‌మావేశంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా ఇస్తాంబుల్ వేదిక‌గా ఉక్రెయిన్ తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని పుతిన్ ప్ర‌క‌టించిన కొద్ది గంట‌లోనే..జెలెన్ స్కీ కూడా స్పందించారు. తాము శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మేన‌ని ఆయ‌న వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోమారు పుతిన్ తో ట్రంప్ ఫోన్ మాట్లాడారు. ఏండ్ల నుంచిచి కొన‌సాగుతున్న రెండు దేశాల మ‌ధ్య యుద్దానికి ఈ చ‌ర్చ‌ల‌తో శుభంకార్డు ప‌డ‌నుంద‌ని ర‌ష్యా-ఉక్రెయిన్ ప్ర‌జ‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -