Saturday, March 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమరో మెట్టు దిగిన ట్రంప్..డెడ్‌లైన్ పొడిగింపు

మరో మెట్టు దిగిన ట్రంప్..డెడ్‌లైన్ పొడిగింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో మెట్టు దిగారు. యూఎస్‌-ఇజ్రాయెల్‌తో యుద్ధ విరమణకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్‌ నిర్దంద్వంగా తిరస్కరించినప్పటికీ హొర్ముజ్‌ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్‌ వ్యవస్థలను నాశనం చేస్తామంటూ గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించారు. గతంలో తాను ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్‌ను ఉపసంహరించి ఇరాన్‌కు మరో ఐదు రోజులు గడువిస్తున్నట్టు ఈ నెల 23న ట్రంప్‌ ప్రకటించారు. అయితే దానికి స్పందన లేకపోవడంతో మరోసారి తన గడువు పొడిగించారు. ఇరాన్‌లోని విద్యుత్‌ ప్లాంట్లపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తామని ఏప్రిల్‌ 6వ తేదీ 8 పీఎం వరకు దానికి డెడ్‌లైన్‌ విధిస్తున్నట్టు గురువారం ప్రకటించారు.

ఫిబ్ర‌వ‌రి 28న ఇజ్రాయిల్-అమెరికా దేశాలు ఇరాన్‌పై సంయుక్త దాడుల‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌తీదాడుల‌కు దిగిన ఇరాన్..గ‌ల్ప్ దేశాల్లో ఉన్నా యూఎస్ సైనిక స్థావ‌రాల‌పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. 24 రోజులు యుద్ధం కొన‌సాగిన త‌ర్వాత ట్రంప్ స్వ‌యంకృత విరామం ప్ర‌క‌టించారు. ఐదు రోజుల పాటు దాడులకు బ్రేక్ ఇస్తున్నామ‌న్నారు. మ‌రో వైపు ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్‌పై దాడులు కొన‌సాగిస్తునే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -