Friday, October 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత ఉద్యోగులకు ట్రంప్‌ మరో షాక్‌

భారత ఉద్యోగులకు ట్రంప్‌ మరో షాక్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో వలసదారుల పని అనుమతులను (ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ – ఇఎడి) ఆటోమేటిక్‌గా రెన్యువల్‌ చేసే విధానానికి అక్కడి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ముగింపు పలికింది. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. 2025 అక్టోబర్‌ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్‌ పర్మిట్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్‌ రెన్యువల్‌ ఉండదని సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. అమెరికాలో ఐటి, హెల్త్‌కేర్‌, రీసెర్చ్‌ రంగాల్లో పని చేస్తున్న భారతీయులు ఈ కొత్త నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇఎడి అనేది అమెరికా ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. ఇది ఉన్నవారికి మాత్రమే అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే హక్కు ఉంటుంది. ఈ పత్రం గడువు ముగిసిన తర్వాత ఉద్యోగం కొనసాగించాలంటే తప్పనిసరిగా రెన్యువల్‌ చేయాలి. గ్రీన్‌కార్డ్‌తో శాశ్వత నివాసం పొందిన వారు ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే హెచ్‌-1బి, ఎల్‌-1బి, ఒ, పి వంటి వీసాలతో ఉన్న నాన్‌ ఇమిగ్రెంట్‌ ఉద్యోగులు కూడా వేరుగా ఈఏడీ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ గ్రీన్‌కార్డ్‌ పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, అలాగే ఎఫ్‌-1, ఎం-1 వీసాలతో చదువుకునే విద్యార్థులు లేదా డిపెండెంట్‌ వీసాతో ఉన్నవారు అమెరికాలో పని చేయాలనుకుంటే తప్పనిసరిగా ఇఎడి తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -