నవతెలంగాణ-హైదరాబాద్: గ్రీన్‌లాండ్ దురాక్రమణ కోసం ట్రంప్ చర్యలు శృతి మించుతున్నాయి. ఇప్పటికే గ్రీన్‌లాండ్ ప్రాంతానికి యూఎస్ యుద్ధ విమానాన్ని తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ సొంత సోషల్ మీడియా ప్లాట్ పామ్ ట్రూత్ సోషల్ వేదికగా అత్సుత్సాహం ప్రదర్శించారు. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌లాండ్‌ను యూఎస్ స్వాధీనం చేసుకున్నట్లుగా, అమెరికాలో ఆ ప్రాంతం అంతర్భాగంగా ఉన్నట్లు మ్యాప్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఉపాధ్యక్షడు జేడీవాన్స్, జాతీయ సెక్రటరీ మార్కో రూబియోలతో కలిసి ట్రంప్ యూఎస్ జాతీయ జెండాను చేతబూని గ్రీన్‌లాండ్‌పై ఎగరేసినట్టు ఓ ఫొటో పోస్టు చేశారు.
మరోవైపు ట్రంప్ తీరును నాటో సభ్యదేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. గ్రీన్‌లాండ్ ఆక్రమణను నివారించడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు నడుంబిగించాయి. గ్రీన్‌లాండ్ పరిరక్షణే లక్ష్యంగా డెన్మార్క్‌కు సైనిక సాయం అందించడానికి సిద్దమైయ్యాయి. డెన్మార్క్ సైనిక దళాలను తరలిస్తోంది. అదే విధంగా కెనడా కూడా వైమానిక దళాలను తరలించడానికి సన్నాహాలు మొదలు పెట్టింది.





