Tuesday, September 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ దేశాల‌తో ట్రంప్ కీల‌క భేటీ

ఆ దేశాల‌తో ట్రంప్ కీల‌క భేటీ

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం వివిధ ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన నేతలతో, అధికారులతో గాజాపై చర్చించనున్నారు. ఈ విషయాన్ని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ సోమవారం విలేకరులకు చెప్పారు. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ), ఖతార్‌, ఈజిప్టు, జోర్డాన్‌, టర్కీ, ఇండోనేషియా, పాకిస్తాన్‌ దేశాలకు చెందిన నేతలతో ట్రంప్‌ గాజాపై చర్చించనున్నారని ఆయన అన్నారు. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని.. అందుకే ముస్లిం దేశాల నేతలతో చర్చించనున్నారని కరోలిన్‌ తెలిపారు. గాజా- ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని ఆపాలని, బందీలను విడుదల దిశగా ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. హమాస్‌ ప్రయమేయం లేకుండా.. గాజాలో ఇజ్రాయిల్‌ ఉపసంహరణ, యుద్ధానంతర పాలన వంటి విషయాలపై ముస్లిం నేతల బృందం ముందు ట్రంప్‌ చర్చకు పెట్టనున్నారని అమెరికా మీడియా ఆక్సియోస్‌ నివేదించింది. అయితే మరోవైపు.. ఇజ్రాయిల్‌ ఉపసంహరించడానికి వీలుగా పరివర్తన, పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులు అందించాలని, గాజాకు సైనిక దళాలను పంపడానికి అరబ్‌, ముస్లిం దేశాలు అంగీకరించాలని వాషింగ్టన్‌ కోరుకుంటున్నట్లు ఆక్సియోస్‌ నివేదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -