– టి1 ఫోన్ 8002 తయారీపై అనుమానాలు
– ఫోన్ పరిమాణం తగ్గింపు
న్యూయార్క్: ట్రంప్ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రకటించిన టి1 ఫోన్ 8002 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ‘మేడ్ ఇన్ అమెరికా’ ట్యాగ్‌ను తొలగించింది. ఈ ఫోన్ పరిమాణం కూడా తగ్గినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. ట్రంప్ మొబైల్ వైర్‌లెస్ క్యారియర్ ద్వారా విక్రయిస్తోన్న టి1 ఫోన్ 8002 గోల్డ్ వెర్షన్‌ను గతంలో తమ వెబ్‌సైట్‌లో ‘మేడ్ ఇన్ యుఎస్‌ఎ’ అంటూ ప్రముఖంగా ప్రచారం చేసింది. తాజాగా దీన్ని తొలగించారు. ఇప్పుడు అదే వెబ్‌సైట్‌లో ఆ ఫోన్‌కు ‘ప్రీమియం పెర్ఫార్మెన్స్. ఫ్రౌడ్లీ అమెరికా’ అనే కొత్త ట్యాగ్‌లైన్‌ను జోడించింది. ఈ ఫోన్ అమెరికా విలువలను దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడిందని పేర్కొంది. మరోవైపు ఈ ఫోన్ పరిమాణాన్ని కూడా 6.78 అంగుళాల నుంచి 6.25 అంగుళాలకు తగ్గించింది. 12 జిబి ర్యామ్ ఉంటుందని అంతక్రితం ప్రకటించిన విషయాన్ని ఇప్పుడు వెబ్‌సైట్ నుంచి తొలగించడంతో దీన్ని కూడా తగ్గించి ఉంటుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ ధరను 499 డాలర్లు (దాదాపు రూ.42,000)గా నిర్ణయించింది. వచ్చే సెప్టెంబర్‌లో దీన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే దీన్ని ఎక్కడ తయారు చేస్తోన్నామనే విషయాన్ని స్పష్టం చేయకపోవడం పట్ల నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర వద్ద అమెరికాలో తయారు చేయడం కష్టమని నిపుణులు అంటున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రతినిధి మాత్రం ఈ ఫోన్ అమెరికాలోనే తయారవుతుం దన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో తమ ఉత్పత్తులు పోటీ పడటానికి వీలుగా ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడానికి చైనా తయారీదారులతో జట్టు కట్టినట్లు సందేహాలు రావడంతో ట్రంప్ వాగ్దానాలపై ఆ దేశ సిటిజన్స్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు లేవనెత్తుతున్నారు.
ట్రింగ్‌మనని ట్రంప్ ఫోన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES