Monday, September 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసినిమా రంగంపై ట్రంప్ టారిఫ్ ల మోత

సినిమా రంగంపై ట్రంప్ టారిఫ్ ల మోత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్‌ సినిమాలకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలపై ట్రంప్‌ వంద శాతం సుంకాలు విధించారు. చిన్న పిల్లల నుంచి క్యాండీని లాక్కున్నట్లు ఇతర దేశాలు తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని లాక్కున్నాయని ఆరోపించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ట్రంప్ విధించించిన ఈ సుంకాల ప్రభావం ఇండియన్ సినిమాలపై ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. అమెరికాలో విడుదల చేసే తెలుగు సినిమాలపై ఇక నుంచి వందశాతం ట్యాక్స్‌ పే చేయాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -