నవతెలంగాణ-హైదరాబాద్: గ్రీన్‌లాండ్ దురాక్రమణను తీవ్రంగా ప్రతిఘటించిన ఫ్రాన్స్ పై ట్రంప్ సుంకాల మోత మోగించారు. ఆ దేశానికి చెందిన వైన్లు, షాంపైన్లపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. అంతకుముందు గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్ దేశాలే లక్ష్యంగా ఆయా దేశాలపై పది శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకార చర్యగా ట్రేడ్ బజూకను తొలిసారి ఉపయోగించేందుకు ఈయూ సిద్ధమైంది.
అయితే గాజాలో ఇజ్రాయెల్-హమాస్ శాంతి మండలిలో ఫ్రాన్స్ చేరావల్సిందిగా ట్రంప్ కోరారు. ఈ ఆహ్వానాన్ని మెక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ నుంచి 200 శాతం సుంకాల హెచ్చరిక చేశారని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
ఇదిలావుండగా పారిస్ వేదికగా జీ7 సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి యూఎస్ ప్రెసిడెంట్‌ను ఆహ్వానించినట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలిపారు. ఈ మేరకు ఆయనకు లేఖ పంపినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా పర్సనల్ గా పంపిన సందేశాన్ని కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.




