నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవలె గాజా-ఇజ్రాయిల్ దేశాల మధ్య రెండేండ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ..గాజా శాంతి ప్రణాళికపై ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. శాంతి ఒప్పందంలో భాగంగా ఇరుపక్షాలు బందీలను విడుదల చేసుకున్నాయి. తాజాగా గాజాలో నెలకొన్న పరిస్థితులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ గాజాలో సాధారణ పౌరులను హమాస్ టార్గెట్ చేస్తే, అప్పుడు హమాస్‌పై మిలిటరీ చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ట్రుత్ సోషల్ అకౌంట్‌లో ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘించి, గాజాలో సాధారణ ప్రజలను హమాస్ చంపితే అప్పుడు వాళ్లను చంపడం తప్ప తమ వద్ద ఆప్షన్ లేదన్నారు.
హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES