Tuesday, January 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ పాల‌న‌పై స‌న్న‌గిల్లిన విశ్వాసం: రాయిటర్స్‌-ఇప్సాస్ పోల్‌

ట్రంప్ పాల‌న‌పై స‌న్న‌గిల్లిన విశ్వాసం: రాయిటర్స్‌-ఇప్సాస్ పోల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వలసలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేశారు. ఈ విషయంలో తొలుత ఆయనకు ప్రజల నుంచి భారీ ఆమోదం లభించింది. అయితే రానురాను ప‌రిస్థితులు శృతిమించిపోతున్నాయి. వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికా (USA)లోని పలు ప్రాంతాల్లో ట్రంప్ యంత్రాంగం ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించింది. ఆ ఏజెంట్ల చేతిలో ప‌లువురు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. తాజాగా వలసలపై ఆయన తీసుకుంటున్న కఠినచర్యలు చాలాదూరం వెళ్లాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాయిటర్స్‌-ఇప్సాస్‌ నిర్వహించిన పోల్‌లో ఈ విషయం వెల్లడైంది.

వ‌ల‌స‌దారుల‌పై ట్రంప్ స‌ర్కార్ అవ‌మానుష‌యం ప్ర‌వ‌ర్తిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల స్కూల్ విద్యార్థిని ఇమిగ్రేష‌న్ అధికారులు అదుపులోకి తీసుకున్న‌, ఈ సంఘ‌ట‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఓ మ‌హిళ రచ‌యిత‌పై కూడా కాల్పులు జ‌ర‌ప‌డంతో ఆమె చ‌నిపోయింది. ఈ త‌ర‌హా సంఘ‌ట‌న‌ల‌తో అమెరిక‌న్లు తీవ్ర అగ్ర‌హాం ఉన్నారు. ఇటీవ‌ల ట్రంప్ ఏడాది పాల‌న‌పై యూఎస్ లో ఆందోళ‌న‌లు మిన్నంటిన మింటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -