Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు బిగ్ అలర్ట్..

తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు బిగ్ అలర్ట్..

నవతెలంగాణ -హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు రెడీ అవుతున్నారు. మే 7వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీoతో తెలంగాణ రాష్ట్రంలో మీ ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ పరిరక్షణ అలాగే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ… ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది.
ఈ మేరకు ఈ నెల ప్రారంభంలోనే ఈ విషయాన్ని ప్రకటించారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆ సందర్భంగా… ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కూడా.. తమ సమస్యలను తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లి 21 డిమాండ్లతో కూడిన లేఖను కమిషనర్ కు అందించారు. ఎన్నిసార్లు సమ్మె నోటీసు ఇచ్చినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పందించడం లేదని, అటు ఆర్టీసీ యాజమాన్యం అలాగే వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని… ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల మే ఏడో తేదీన సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img