- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలకు వచ్చిన భక్తులు స్కాన్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు అంటూ పేర్కొంది టీటీడీ పాలక మండలి. తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సప్ ద్వారా తెలియజేయవచ్చు. తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్‌లను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేస్తే వాట్సప్‌లో ఫీడ్‌బ్యాక్ పేజీ ఓపెన్ అవుతుంది. అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, దర్శన, క్యూలైన్, గదులపై రేటింగ్ ఇవ్వొచ్చు.
- Advertisement -