Sunday, May 4, 2025
Homeరాష్ట్రీయంటీయూఎంహెచ్‌ఇయూ సమ్మె నోటీస్‌

టీయూఎంహెచ్‌ఇయూ సమ్మె నోటీస్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) తెలిపింది. ఈ మేరకు యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర అధ్యక్షులు ఎండి.ఫసియొద్దీన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ శుక్రవారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చొంగ్తూకు సమ్మె నోటీస్‌ అందజేశారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్‌, అసోసియేషన్ల జాయింట్‌ ప్లాట్‌ ఫామ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ పిలుపులో భాగంగా ఈ సమ్మె జరుగుతు న్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 2019, 2020 సంవత్సరాల్లో 4 లేబర్‌ కోడ్‌లను పార్లమెంటులో చట్టాలుగా చేసిం దని చెప్పారు. ఈ లేబర్‌ కోడ్‌లు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్ని స్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేబర్‌ కోడ్‌లతో కార్మికుల 8 గంట ల పని దినం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, యూనియన్‌ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కుల్లో అనేక మార్పులు వచ్చి కార్మిక హక్కులు హరించబడతాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, యుటీయుసీ తదితర సంఘాలతో పాటు రాష్ట్రంలో బీఆర్టీయూ, టీయుసీఐ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయుసీ లాంటి సంఘాలు ఈ ఏడాది మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని వివరించారు. ఇందులో భాగంగా పారిశ్రామిక వివాదల చట్టం-1947లోని సెక్షన్‌ -22 సబ్‌ సక్షన్‌ (1) ని అనుసరించి సమ్మె నోటీస్‌ అందిస్తున్నట్టు తెలిపారు.
నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనీ, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలనీ, కనీస వేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించాలని వారు డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలనీ, ఎన్‌ హెచ్‌ఎం ఎంప్లాయీస్‌, 2వ ఏఎన్‌ఎం, ఈసీ ఏఎన్‌ఎం, అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ ఏఎన్‌ఎం, హెచ్‌ఆర్డీ ఏఎన్‌ఎంలతో పాటు 104, 108, 102, ఆరోగ్య మిత్ర, టీశాక్స్‌, హాస్పిటల్‌ వర్కర్లు, టి హబ్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌, ఆయుష్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు తదితరులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, సీపీఎస్‌ విధానం రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిం చాలని తదితర 12 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -