నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై ఇజ్రాయిల్ దేశ సైన్యాలు మారణోమం సృష్టించిన విషయం తెలిసిందే. వైమానిక దాడులతో విరుచుపడుతూ అనేక మంది అమాయకులను బలితీసుకుంది. ఇండ్లు, దవాఖాన్లు అనే తేడా లేకుండా విచాక్షణరహితం కాల్పులు జరుపుతోంది. గాజాకు మానవత సాయంగా పలు దేశాలు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నాయి. ఆ వాహనాలను అడ్డుకోవడంతో పాటు ఆహారం కోసం క్యూలైన్ల్‌లో వేచి ఉన్న బాధితులపై ఇజ్రాయిల్ సైన్యాలు కర్కష్కంగా కాల్పులు జరిపిన ఉదంతాలలో అనేక మంది చిన్నారులు చనిపోయారు. అంతేకాకుండా ప్రజలకు నిలువనీడ లేకుండా అనేక భవనాలను నేలమట్టం చేశాయి. దీంతో గాజాలో ఎటుచూసినా బూడిద దిబ్బల కన్పిస్తున్నాయి. ఆ శిథిలాల కిందపడి అనేకమంది మృతి చెందగా..మృతదేహాలు గుట్టలుగుట్టలుగా బయటపడ్డాయి.
మరోవైపు గాజాపై ఇజ్రాయిల్ దుశ్చర్యలను ప్రపంచదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే ఇజ్రాయిల్ గాజాతో యుద్ధం ఆపేయాలని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తూ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తోపాటు పలు దేశాలు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గాజాలో ఇజ్రాయిల్ దురాగాతాలను నిరసిస్తూ పలు దేశాల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా గాజాపై యుద్ధాన్ని కొనసాగిస్తున్నందుకు ఇజ్రాయిల్ పై తుర్కియేలో నిరసనలు మిన్నంటాయి.
వచ్చే ఏడాదిలో జరిగే పుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో ఇజ్రాయిల్ పుట్ బాల్ జట్టు ఆడకుండా నిషేధం విధించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తుర్కియే ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఇబ్రహీం హసియోస్మానోగ్లు శుక్రవారం అంతర్జాతీయ ఫుట్‌బాల్ నాయకులకు ఒక లేఖ పంపారు, “ఇప్పుడు FIFA, UEFA చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది” అని కోరారు