- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ వేళ దాయాది దేశానికి మద్దతుగా ప్రచారం చేస్తున్న పలు అంతర్జాతీయ మీడియా సంస్థలపై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా తుర్కియే పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ టీఆర్‌టీ వరల్డ్ ను కూడా భారత్ బ్లాక్ చేసేసింది. ఆ అకౌంట్‌ను విత్‌హెల్డ్ లో ఉంచింది. మరోవైపు భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకుంది. టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువులను భారత్‌లో విక్రయించవద్దని పలు రాష్ట్రాల వ్యాపారస్తులు ప్రకటించారు.
- Advertisement -