- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ బర్కత్‌పురలో ఏసీ పేలి కవలలు మరణించారు. నిన్న సాయంత్రం మూడేళ్ల రహీం ఖాద్రి, రెహ్మాన్ ఖాద్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఏసీ బ్లాస్ట్ అయింది. మంటలు చెలరేగడం, పొగ కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే AC కంప్రెషర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. నాణ్యమైన స్టెబిలైజర్ వాడాలని, క్రమం తప్పకుండా ACని సర్వీసింగ్ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Advertisement -



