Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టుల సంక్షేమమే టీడబ్ల్యూజే ఎఫ్ లక్ష్యం 

జర్నలిస్టుల సంక్షేమమే టీడబ్ల్యూజే ఎఫ్ లక్ష్యం 

- Advertisement -

– జర్నలిస్టు మరణిస్తే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
-జర్నలిస్టుల హక్కుల  సాధన కోసం పోరాటాలు నిర్వహిస్తాం 
– రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్
– జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం 
నవతెలంగాణ-భూపాలపల్లి
: జర్నలిస్టుల సంక్షేమమే  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లక్ష్యమని, జర్నలిస్టు మరణిస్తే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, హక్కులను సాధన కోసం పోరాటాలను ఉదృతం చేస్తామని టిడబ్ల్యూజెఎఫ్  రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ అన్నారు. శుక్ర వారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జర్నలిస్టుకు జీతభత్యాలు లేకుండా 24 గంటలు నిద్రాహారాలు మాని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ పనిచేస్తున్నారన్నారు. 
జర్నలిస్టులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని , జర్నలిస్టు ఆరోగ్య భద్రత లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబానికి మీడియా అకాడమీ నుండి కేవలం లక్ష రూపాయలు మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నారని  ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . మృతిచెందిన జర్నలిస్టు భార్యకు కేవలం 3వేల పెన్షన్ అందిస్తున్నారని ఇకనుండి 5వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 ప్రభుత్వాలు జారీ చేసిన హెల్త్ కార్డులు పనిచేయకుండా పోయాయని పని ఒత్తిడి వలన అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యం పాలవుతురని తెలిపారు.జర్నలిస్టులతో పాటు వారి కుటుంబాల ఆరోగ్య పరిస్థితులు గాలిలో దీపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హులైన జర్నలిస్టుల కు ఆక్రిడిటేషన్ కార్డ్స్ అందించటం లో ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు నివేశ స్థలాలను సంబంధించి పాలసీ ప్రకటించి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో వివిధ రకాల మీడియా సంస్థలు పుట్టగొడుగుల పుట్టు కోస్తున్నాయని పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు జర్నలిస్టులకు గడ్డుకాలం రాబోతుందని హెచ్చరించారు.  మీడియా గడ్డు పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత జర్నలిస్టు యూనియన్ల భుజస్కందాలపై ఉందన్నారు. జర్నలిస్టు సమస్యల సాధన కోసం యూనియన్లకు అతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని,రానున్న రోజులలో మీడియాస్థితిగతులు మరింత జటిలంగా మారనున్నాయని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు సాధించేవరకు పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. 
యూనియన్ సభ్యత్వనమోదును పూర్తి చేసుకొని త్వరలోనే జిల్లా మహా సభలు నిర్వహించి నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. మంచి  ఆలోచన విధానంతో పని చేసి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం టియుడబ్ల్యూ జే హెచ్(143)
టియుడబ్ల్యూజే (ఐజేయు) చెందిన కొందరు నాయకులు టిడబ్ల్యూజేఎఫ్ లో చేరడంతో వారికి దయాసాగర్ సభ్యత్వం అందించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా నాయకులు ఎర్రం సతీష్ కుమార్, గుజ్జ సారేశ్వర్ రావు, చెరుకు సుధాకర్, ములకల లక్ష్మారెడ్డి, దూలం కుమారస్వామి,జగన్, వెల్దండి సత్యనారాయణ, రహీం పాషా, సృజన్,ఆకుతోటప్రవీణ్,భూమిరెడ్డి,భాస్కర్,సమీర్,మార్క మురళీ కృష్ణ,రాజేందర్,సాగర్,తిరుపతి, మాదాసి ఉమేష్,  ప్రభాకర్, లతోపాటు జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad