Wednesday, July 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉప్పల్ రింగ్ రోడ్లో రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్

ఉప్పల్ రింగ్ రోడ్లో రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: హబ్సిగూడ నుంచి ఉప్పల్ వస్తున్న బెలోనో కారును వెనుక నుండి ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఉప్పల్ రింగు రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. బెలోనో కారు నడపతున్న యువతి కిమ్స్లో డాక్టర్ అని తెలిసింది. ఆమె నిద్ర మత్తులో ఉండడం వలన ఈ ప్రమాదం జరిగింది. కారులో రెండు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఈ ఘటనతో ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అసలే ఉదయం నుంచి హైదరాబాద్ సిటీలో వర్షం పడుతుండటంతో ట్రాఫిక్ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇలాంటి సమయంలో.. కార్లు ఢీ కొట్టుకోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -