Monday, March 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యుత్ షాక్‌తో రెండు ఏనుగులు మృతి

విద్యుత్ షాక్‌తో రెండు ఏనుగులు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా సమీపంలో విద్యుత్ షాక్‌కు గురై రెండు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే.. స్థానిక రైతులు అడవి పందుల బెడద నుంచి తమ పంటలను రక్షించుకోవడానికి పొలాల చుట్టూ విద్యుత్ తీగలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి సమయంలో ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన రెండు ఏనుగులు, ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ తీగలను తాకాయి. హైఓల్టేజ్ విద్యుత్ ప్రవహిస్తుండటంతో ఆ మూగజీవాలు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాయి.

సోమవారం ఉదయం పొలాల్లో ఏనుగుల మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారులు మృతదేహాలను పరిశీలించి, అవి విద్యుత్ షాక్ వల్లే మరణించాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అటవీ శాఖ అధికారులు, కంచె ఏర్పాటు చేసిన వ్యక్తుల కోసం విచారణ జరుపుతున్నారు. ఉద్దేశపూర్వకంగా కరెంట్ ఉచ్చు ఏర్పాటు చేశారా? లేదా కేవలం పంట రక్షణ కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -