Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅడ్డంగా దొరికిన‌ రెండు ఇండ్లు పూజారి

అడ్డంగా దొరికిన‌ రెండు ఇండ్లు పూజారి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: సినిమాల్లో త‌ర‌హాలో సింగ‌పూర్లో ఓ రెండు ఇండ్ల పూజారి అడ్డంగా దొరికిపోయారు. తన రెండో భార్య ప్రసవం కోసం భర్త అక్కడికి రావడంతో అతడి గుట్టు రట్టయింది.2022 ఆగస్టులో ఇద్దరూ భారత్‌లోని నాగూర్‌లో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం సింగపూర్ తిరిగివచ్చిన ముత్తుకుమార్, మొదటి భార్యతోనే నివసిస్తూ రహస్యంగా సల్మాను కలుస్తుండేవాడు. ఈ క్రమంలో సల్మా గర్భం దాల్చింది. 2023 సెప్టెంబర్ 14న ప్రసవం కోసం కేకే మహిళా, శిశు ఆసుపత్రిలో చేరింది. అదే ఆసుపత్రిలో ముత్తుకుమార్ మొదటి భార్య పనిచేస్తోంది.

రెండో భార్యకు బాబు పుట్టడంతో ఆసుపత్రిలోని డెలివరీ సూట్ నుంచి బయటకు వస్తున్న ముత్తుకుమార్‌ను మొదటి భార్య చూసింది. అనుమానంతో అతడిని నిలదీయగా రెండో పెళ్లి వ్యవహారం బయటపడింది. దీనికి తోడు, జూన్ 12, 2024న సింగపూర్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటూ తనకు వేరే వివాహాలు లేవని ముత్తుకుమార్ తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రెండో భార్య సల్మా.. అతడి మోసం గురించి అధికారులకు ఫిర్యాదు చేసింది.

విచారణ చేపట్టిన పోలీసులు ముత్తుకుమార్‌పై ద్విభార్యత్వం, ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో, సింగపూర్ కోర్టు అతడికి మూడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. అతడు ఇద్దరు మహిళలనూ మోసం చేశాడని, అనుకోని రీతిలో ఈ విషయం బయటపడిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad