- Advertisement -
- రివార్డు చెక్కులను అందజేసిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా
నవతెలంగాణ- గోదావరిఖని
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సీనియర్ నాయకులు ఆత్రం లచ్చన్న, ఆత్రం అరుణ మంగళవారం రామగుండం కమిషనరేట్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు. 30 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉంటూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆత్రం లచ్చన్న, బస్తర్ లో డివిజన్ కార్యదర్శిగా ఉన్న అరుణ మంగళవారం సాయంత్రం రామగుండం కమిషనరేట్ లొంగిపోయారు. సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు.
ఆత్రం లచ్చన్న(65) అలియాస్,గోపన్న, అలియాస్ రాజప్పగా మావోయిస్టు పార్టీలో లచ్చన్న పని చేశారు. ఆయన స్వస్థలం పారపల్లి గ్రామం, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా అని పోలీసులు తెలిపారు.
- Advertisement -