- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను ఇటీవల భారత్‌లో కనుగొన్నారు.
- Advertisement -