నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్: నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో మేలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్ల వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభించారు. అనంతర చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని శాశ్వతంగా నివారించొచ్చనని తెలిపారు. అంగవైకల్యాన్ని పూర్తిగా నివారించి,చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుదామని ఆయన పిలుపునిచ్చారు.ఇవాళ,రేపు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయిస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తల్లిదండ్రులు పోలియో పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ పిల్లలకు పోలియో చుక్కలు క్యాంపునకు తరలిరావాలని ఏఎన్ఎం సువర్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో పల్లెదవఖానా డాక్టర్ సంధ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎం అంబాజీ, మాజీ ఉప సర్పంచ్ అజీజ్, నాయకులు పి అశోక్ బాబు, టి కృష్ణయ్య గౌడ్, చింతకాయల లక్ష్మణ్, బొమ్మ శంకరయ్య గౌడ్, పి శివుడు, గ్రామ అంగనవాడీ టీచర్లు వసంత లక్ష్మి, భూషణమ్మ, నశ్రీన్ బేగం, అశా వర్కర్ సరస్వతి చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.