నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీ లో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే. నగరంలో ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టు వారికి రిమాండ్ విధించింది. మూడు రోజుల పాటు ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దళంలో ఆధీనంలో ఉండనున్నారు.
నిఘా సంస్థల నుంచి అందిన పక్కా సమాచారంతో ఢిల్లీలోని సాదిక్‌నగర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దళం (స్పెషల్ సెల్) సోదాలు చేపట్టింది. నిందితుల్లో ఒకరు భోపాల్‌కు చెందిన అద్నాన్ కాగా.. మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. ఆత్మాహుతి దాడుల కోసం ఇద్దరు శిక్షణ పొందుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.



