- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారాలోని కేరన్ సెక్టార్‌లో చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. మొదటగా భద్రతా దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించాయి. దీంతో ఎదురుకాల్పులకు దిగడంతో సైన్యం కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. మరొక ఉగ్రవాది నక్కి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
- Advertisement -



