- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రెండు వేల నాటు కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి వెంట పొలాల్లో వీటిని విడిచిపెట్టారు. దీంతో నాటు కోళ్లను తెచ్చుకోవడం కోసం జనం ఎగబడ్డారు. అందినకాడికి దొరకబట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే.. ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో తెలియాల్సి ఉంది
- Advertisement -



