Wednesday, April 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరెండు వారాల పాటు కాల్పుల విరమణ: డోనాల్డ్ ట్రంప్

రెండు వారాల పాటు కాల్పుల విరమణ: డోనాల్డ్ ట్రంప్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై అర్ధరాత్రి జరగాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. రెండు వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్‌తో చర్చల అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై ఈ రాత్రి జరగాల్సిన దాడులను నిలిపివేయాలని వారు చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. హోర్ముజ్ జలసంధిని తక్షణమే తెరవాలన్న షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరించానని ట్రంప్ తెలిపారు. ఇరాన్ నుంచి 10 సూత్రాలతో ఒక ప్రతిపాదన అందిందని.. దానిపై సానుకూలంగా చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న వివాదాస్పద అంశాల్లో చాలా వాటిపై రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ రెండు వారాల వ్వయధిలో తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -