Sunday, May 4, 2025
Homeజాతీయంమణిపూర్‌ హింసకు రెండేండ్లు

మణిపూర్‌ హింసకు రెండేండ్లు

- Advertisement -

– ఇంతవరకూ ఆ రాష్ట్రాన్ని సందర్శించని ప్రధాని మోడీ
ఇంఫాల్‌:
మణిపూర్‌ హింసకు రెండేండ్లు పూర్తయ్యాయి. 2023 మే 3వ తేదీన ఆ రాష్ట్రంలో మైతీ, కుకీ జాతుల మధ్య చెలరేగిన హింస మొదలై శనివారానికి రెండేండ్లు పూర్తైంది. ఈ హింస వల్ల 260 మంది మృతి చెందారు. సుమారు 70 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో శాంతి నెలకొనలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధమైన చర్యలు చేపట్టలేదు. దేశ,విదేశాల పర్యటనల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ ఇంతవరకూ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. రెండేండ్ల అయినప్పటికీ అక్కడ ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర సిఎం బీరెన్‌సింగ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 13న ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. కాగా, మణిపూర్‌ హింసకు రెండేండ్లయిన సందర్భంగా కుకీ, మైతీ సంఘాలతోపాటు, ఇతర సంఘాలు కూడా శనివారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు, ప్రయివేట్‌ కార్యాలయాలు, పాఠశాలల, కళాశాలలు, ఇతర సంస్థలు కూడా మూసివేశారు. అవాంఛనీయ కార్యకలాపాలను నివారించడానికి కీలకమైన ప్రదేశాలలో భద్రతా దళాలను కూడా మోహరించినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -