నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉబర్ క్యాబ్ సర్వీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 9న ఓటర్లకు ఉచితంగా(ఆటో, కారు, బైక్) తమ సర్వీస్‌ను అందిస్తామని బుధవారం వెల్లడించింది. కేరళలోని ఏ నియోజకవర్గంలోనైనా ఉబర్ యాప్ ద్వారా పికప్ పాయింట్ నుండి 2 కిలోమీటర్ల వరకు ప్రయాణం పూర్తిగా ఉచితమని, రెండు కిలోమీటర్లకు మించిన ప్రయాణానికి, ఓటర్లు అదనపు దూరానికి ఉబెర్ నిర్ధారించిన ప్రామాణిక ఛార్జీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేల..ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా, 140 అసెంబ్లీ స్థానాలకు ఓకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఆ రోజు కేరళలో ఉబర్ సేవలు ఉచితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



