– వాకిలలో ముగ్గులు వేసిన మహిళలు
నవతెలంగాణ -మిరుదొడ్డి : పరాభవ నామ సంవత్సర సంవత్సరాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా లో ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం లేవగానే వాకిళ్లలో ఆడపడుచులు ముగ్గులు వేసి,ఇళ్లను శుభ్రం చేసుకుని పచ్చడి తోరణాలు తో ఇల్లు అలంకరించారు. వేపాపువ్వు, మామిడికాయ పులుపు, బెల్లం తీపి కొత్త కుండలో కలిపి అన్ని రకరకాల రుచులను కలిపి పచ్చడిని తయారుచేసి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం సమయంలో గ్రామాల్లో పంచాంగ కార్యక్రమాన్ని నిర్వహించి రాశుల వారిగా వారి పంచాంగం ఎలా ఉందో వేద పండితులు పంచాంగ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా ఉగాది సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



