- Advertisement -
నవతెలంగాణ-కుభీర్ : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో గురువారం ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు ఉదయం సమయంలో తమ తమ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి నూతన పనులకు శ్రీకారం చుట్టారు. ఉగాది పర్వదిన సందర్భంగా గ్రామాల్లో ఆలయాలు, కుల సంఘాల వద్ద , రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వేద మంత్రం చరణాల మధ్య పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఈ ఏడాదిలో ఏ పంటలకు అధికంగా పండుతాయోనని పంచాంగ పట్టణం చేసుకున్నారు. అనంతరం పంట క్షేత్రాల్లో వివిధ రకాల వంటలు చేసుకొని చా పంక్తి భోజనాలు చేశారు.
- Advertisement -



