నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి సైనిక చర్యలు చేపట్టిన అనంతరం ఇది యూరోపియన్ యూనియన్ సభ్య దేశంలో జెలెన్‌స్కీ మొదటి పర్యటన. జెలెన్‌స్కీ సోమవారం ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డెర్ బెల్లెన్ మరియు చాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్‌లతో సమావేశం కానున్నారు. అనంతరం ఇద్దరు అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జెలెన్‌స్కీ భార్య, ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా మరియు వాన్ డెరె బెల్లెన్ భార్య డోరిస్ ష్మిడౌర్ కూడా సమావేశం కానున్నారు. శాంతి భద్రతలను ప్రోత్సహించడంలో మహిళల పాత్ర గురించి చర్చించనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆస్ట్రియా ఖండించింది. అయితే రష్యాతో దౌత్య సంబంధాలను కొనసాగించాల్సిన అవసరాన్ని కూడా పునరుద్ఘాటించింది. ఉక్రెయిన్‌కు మానవతా సాయం పంపింది. అయితే ఆయుధాలను అందించలేదు.
ఆస్ట్రియాకు వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES