Saturday, December 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమ‌సీదులో ఉగ్ర‌దాడి…ఖండించిన UNO ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి

మ‌సీదులో ఉగ్ర‌దాడి…ఖండించిన UNO ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సిరియాలోని హోమ్స్‌లోని అలీ బిన్‌ అబీ తాలిబ్‌ మసీదులో శుక్రవారం ప్రార్థన సమయంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మృతి చెందారు. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ శనివారం ఖండించారు. ఈ ఘటనలో మృతులకు ఆయన సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘సిరియాలోని హోమ్స్‌లోని అలీ బిన్‌ అబీ తాలిబ్‌ మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పౌరులు, ప్రార్థనా స్థలాలపై దాడులు ఆమోదయోగ్యం కాదు. మృతుల కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారందరికీ నా సానుభూతి. వారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని గుటెరస్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -