- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో UN సెక్రెటరీ జనరల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాక్ హక్ కీలక ప్రకటన చేసారు. భారత్-పాక్ మధ్య మరో సంఘర్షణను ఈ ప్రపంచం అస్సలు భరించబోదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన ప్రకటన చేశారు. భారత్, పాక్ రెండు దేశాలు సంయమనం పాటించాలని మేము బలంగా కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఆవేశంలో యుద్ధం అస్సలు చేయకూడదని సూచించారు. ఆవేశం అనర్థానికి మూలం అని.. ఆవేశంలో యుద్దం చేస్తే నష్టం తప్ప లాభం ఉండదని వెల్లడించారు.
- Advertisement -