Wednesday, November 19, 2025
E-PAPER
Homeక్రైమ్వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. జగిత్యాలకు చెందిన సౌజన్య (27) వివాహం పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్‌తో గతేడాది మార్చి 22న జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న కిరణ్, భార్యతో కలిసి టీఎన్‌జీవోస్‌ కాలనీలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం కిరణ్‌ విధులకు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి తలుపులు మూసి ఉన్నాయి. ఇరుగుపొరుగు సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా.. భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్ప‌త్రికి తరలించారు. భర్త కిరణ్‌తోపాటు అత్త మల్లీశ్వరి వేధింపులు తాళలేకనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం చేయనవసరం లేదని పెండ్లి చేసుకొని, పెండ్లి తర్వాత ఉద్యోగం చేయాల్సిందిగా సౌజన్యను బలవంతం చేసేవారని, గర్భం దాల్చలేదని అత్త వేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -