నవతెలంగాణ-చేగుంట
వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్‌కు చెందిన రైతు నాగారపు శ్రీకాంత్ (26)కు ఎకరంన్నర భూమి ఉంది. ఆ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ అవసరాల నిమిత్తం సుమారు రూ.8లక్షల వరకు అప్పులు చేశారు. వీటిని ఎలా తీర్చాలోనని రోజూ మదనపడుతూ ఉండేవాడు. గురువారం ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన శ్రీకాంత్.. మోటార్ కేబుల్ వైర్‌తో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి నాగారపు శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
అప్పులు తీర్చలేక యువ రైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -