Thursday, April 9, 2026
E-PAPER
Homeజిల్లాలుఆర్ఎంపీ, పీఎంపీ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఆర్ఎంపీ, పీఎంపీ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
  • అధ్యక్షులు వనం ప్రవీణ్
  • ప్రధాన కార్యదర్శి పంతంగి నాగరాజు పటేల్….

నవతెలంగాణ-కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫెర్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా గురువారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా లక్ష్మిపురం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు వనం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా ముప్పనపల్లి గ్రామానికి చెందిన పంతంగి నాగరాజును(హనుమాన్ మెడికల్ స్టోర్స్ యజమాని) ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అలాగే ఉపాధ్యక్షులు సుగ్గుల సుధాకర్, కోశాధికారిగా బుద్దె సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులుగా బరపాటి నర్సింహారావు, టక్కెడం దేవాసియాను ఎన్నుకున్నారు.. గౌరవ సలహాదారులు తడకల జగన్, కృష్ణ మూర్తిని ఎన్నుకున్నారు. కన్నాయిగూడెం మండల నూతన కమిటీ ఏకగ్రీవం కావడానికి సహకరించిన సభ్యులందరికి అధ్యక్ష, కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తూ, సంఘ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, నరేష్,మహేందర్,శ్రీనివాస్,రాజశేఖర్,వెంకటనర్సయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -