నవతెలంగాణ-సదాశివనగర్: సదాశివనగర్ మండల ఉపసర్పంచ్ల ఫోరం ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు తెలిపారు. అధ్యక్షుడిగా కయ్యాల నర్సింలు యాదవ్, ఉపాధ్యక్షుడిగా ఎడ్ల గంగారం తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంగారెడ్డి, సేవా దళ్ జిల్లా అధ్యక్షుడు బొంబోతుల లింగ గౌడ్,సీడీసీ చైర్మన్ ఈర్షదుద్దీన్, ఏఎంసీ చైర్మన్ సంగ్య బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్, సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు,నాయకులు,నోముల రూపేందర్ రెడ్డి,గాదారి శ్రీనివాసరెడ్డి, శంకర్ నాయక్, పొన్న దేవేందర్, గ్రామ అధ్యక్షుడు చిన్నన్న, వార్డు సభ్యులు కాట్యాడ హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్,15 గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు.



