నవతెలంగాణ-హైదరాబాద్: అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు రెండో సెమీఫైనల్ జరుగుతుంది. హరారే వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో పాక్‌తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు ఫిబ్రవరి 6 శుక్రవారం ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంటుంది. టీమిండియాకు ఆయుష్ మాత్రే, అఫ్గానిస్థాన్‌కు మహబూబ్ ఖాన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
తుది జట్లు..
భారత్ : ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్
ఆఫ్ఘనిస్తాన్ : ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జారు, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జారు, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్



