నవతెలంగాణ-హైదరాబాద్: అండర్-19లో వరల్డ్ కప్‌లో యంగ్ ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 101పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి ట్రోఫిని కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇండియా 50ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు భారత్ బౌలర్ల ధాటికి 40.1 ఓవర్లకే కూప్పకూలింది. 10 వికెట్లు కోల్పోయి 311 రన్స్ చేసి భారత్ నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని చేధించలేకపోయింది. సీఎం ఫాల్కన్ చేసిన సెంచరీ వృథా అయిపోయింది. భారత్ బౌలర్లు అభిరీష్ 3, దీపేష్,చౌహన్ 2, కిలాన్ పటేల్,మాత్రే తలో వికెట్లు తీశారు.
గ్రూప్‌లో దశలో అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇండియా టీం…శుక్రవారం జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన ఫైనల్ ఫైట్‌లో కూడా అదే జోరును కొనసాగించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. డాషింగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోతకోశాడు. సెమీఫైనల్‌లో సెంచరీ కొట్టిన ఆరోన్ జార్జీ స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరినా..మరో ఎండ్‌లో వైభవ్ దూకుడును కొనసాగించాడు. జార్జీ ఔట్‌తో క్రీజులోకి కెప్టన్ మాత్రే వైభవ్‌కు పూర్తి తోడ్పాటు అందించాడు.
ఇద్దరు కలిసి ఎడాపెడా షాట్‌లతో ఇంగ్లాండ్ బౌలర్లను బెంబేలెత్తించారు. వైభవ్ వీరాబాదుడు ముందు బ్రిటన్ బౌలర్లు తెలిపోయారు. 55 బంతుల్లో సెంచరీ కొట్టిన వైభవ్..ఆ తర్వాత తన ఆటలో వేగం పెంచాడు. కేవలం 17 బంతుల్లో 50 రన్స్ చేసి 150 మార్క్‌ను ఆందుకున్నాడు. ఓ దశలో డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ ఊహించిన తరుణంలోనే..మోర్గాన్ వేసిన 25 ఓవర్లో పరుగుల సునామీ వైభవ్(175-15 ఫోర్లు, 15 సిక్స్) భారీ షాట్ ఆడబోయి కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకు ముందు కెప్టెన్ మాత్రే అర్ధ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. వీరిద్దరి విధ్వంసకార బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
లమ్స్డెన్ వేసిన 8ఓవర్లో 15, మింటో వేసిన 9 ఓవర్లో 18, ఆమేద్ వేసిన 15ఓవర్లో 15, ఆమేద్ వేసిన 17ఓవర్లో 3సిక్సలు ఓ ఫోర్‌తో 22 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గ్రీన్ వేసిన 21ఓవర్లో 19, ఆల్ బర్ట్ వేసిన 22ఓవర్లో 27, మోర్గాన్ వేసిన 25 ఓవర్‌లో25 రన్స్‌ను పిండుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇతర బ్యాటర్లు మలోత్రా 30,కుందా 40, కై చౌహన్ 37 రన్స్ లతో ఇంగ్లాండ్‌కు కొండంతా లక్ష్యాన్ని(411) ముందుంచారు. ఇంగ్లాండ్ బౌలర్లు మింటో 3, మోర్గాన్, గ్రీన్ రెండు వికెట్లు, లమ్స్డెన్ ఒక వికెట్ తీశారు
ఆ తర్వాత చేధనకు దిగిన ఇంగ్లాండ్..ఓపెనర్లు నిరాశపరిచారు. ఇండియన్ పేస్ ద్వయం ధాటికి బ్రిటన్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు.రెండు ఓవర్లు ముగిసిన కూడా పరుగుల ఖాతా తెరలేదు. నాలుగో ఓవర్లో జే మోర్స్ రూపంలో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నెమ్మదిగా క్రీజులో కుదురుకోని బీజే డాకిన్స్ 66 పరుగులు చేసి ఔటైయాడు. బీఏ మాయస్ 45, టీహెచ్ రీ 31 రన్స్ తో రాణించారు. చివరిలో మిట్టన్ (28) తో కలిసి సీఎం ఫాల్కనర్(115) వీరోచితంగా పోరాడి బ్రిటన్ విజయంపై ఆశలు పెంచాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడటంతో ఇండియా విజయం లాంఛనమైంది.



