నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మరోసారి నిరుద్యోగులు రోడ్డెక్కారు. జాబ్ క్యాలెంటర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. వివ్ వాంట్ జస్టిస్ అంటూ ఫ్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరుద్యోగుల ఆందోళనతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈధర్నాలో అశోక్ సర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.
దిల్ సుఖ్ నగర్ లో రోడెక్కిన నిరుద్యోగులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES