చీలాపూర్ శిభిరానికి 90 మంది విద్యార్థుల హజరు
నవతెలంగాణ – బెజ్జంకి: మండల పరిధిలోని చీలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని ప్రధానోపాద్యాయుడు రామంచ రవీందర్ శుక్రవారం తెలిపారు. సుమారు 90 మంది విద్యార్థులు శిక్షణ శిబిరానికి హజరవుతున్నారని నిష్ణాతులైన ఉపాధ్యాయులతో చేతిరాత, కరాటే, యోగా, చిత్రలేఖనం, డాన్స్, ఇంగ్లీష్ బాషపై శిక్షణ అందిస్తున్నారని వేసవి శిబిరంలో విద్యార్థులు పాల్గొనేల తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమని రవీందర్ సంతోషం వ్యక్తం చేశారు.
- Advertisement -